Satavahana University: శాతవాహన వర్సిటీలో విద్యా వారోత్సవాలు: నాక్ అక్రిడేషన్‌పై ఆన్‌లైన్ వర్క్‌షాప్
Satavahana University: తెలంగాణ విద్యా వారోత్సవాల్లో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ కార్యాశాల నిర్వహించారు.
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒకరోజు ఆన్లైన్ కార్యాశాలను సమన్వయ అధికారి డాక్టర్ ఎస్ రమాకాంత్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి మొదటి వక్తగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి సలహాదారులుగా ఉన్న రమ కొండపల్లి విశ్వవిద్యాలయాలలో నాణ్యత ప్రమాణాల గురించి అంతర్గత వ్యవస్థాపన గురించి, కళాశాలలో నాణ్యమైన ప్రమాణాలతో నాక్ గ్రేడ్ సాధించుకోవడంలో ఏర్పాటు చేసుకోవలసిన మెలకువలు గురించి తెలియజేశారు. విద్యాలయాలు అత్యంత పటిష్టమైన సిలబస్లను తయారు చేసి నాణ్యత కొరకు పాటుపడాలని, విద్యాలయాలు తయారు చేసే మేధా సంపత్తిని విద్యార్థులు ఆకలింపు చేసుకొని వాటిని వారి భవిష్యత్తు తరాలకు ఉపయోగించుకొని, అత్యుత్తమ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ,విద్యాలయాలు కావలసిన మౌలిక సదుపాయాలు విద్యా సంబంధమైన సౌకర్యాల గురించి వివరించారు.
రెండవ కార్యక్రమంలో ఉస్మానియా రిటైర్డ్ ఆచార్యులు డాక్టర్ ఎం లక్ష్మీపతిరావు నాయక్ అక్రిడేషన్ కొరకు విశ్వవిద్యాలయాలు అవలంబించాల్సిన విధివిధానాలు, అధ్యాపకులు తమయొక్క పరిశోధనలను మెరుగుపరచుకోవాల్సిన అవసరాల గురించి విద్యార్థులకు ఇన్పుట్ కాకుండా అవుట్ ఫుట్ ఏ రకంగా లభిస్తుందో తెలుసుకోవలసిన కీలక విషయాలను, బోధనలో క్రెడిట్ యొక్క విలువలను కోకరిక్యులర్ యాక్టివిటీస్ యొక్క పాత్రను చాలా విఫలంగా ఆన్లైన్ వెబినారులో వివరించారు. ఈ కార్యాశాలలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, ఓ ఎస్ డి టు విసి డాక్టర్ హరికాంత్, డా. జాఫర్, డాక్టర్ పద్మావతి, వివిధ విభాగాల అధిపతులతో పాటు డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ప్రిన్సిపాల్ లు పాల్గొని నాక్ అక్రిడేషన్ కు సంబంధించిన అన్ని మెలకువలను పొందారు.




