Karimnagar: శాతవాహన వర్సిటీలో కృత్రిమ మేధస్సు, ఔషధ ఆవిష్కరణలపై సదస్సు

Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ వైద్యంలో కృత్రిమ మేధస్సు (AI) పాత్రపై ప్రాముఖ్యత కలిగిన సదస్సు జరిగింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 9 July 2026 8:37 AM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో కృత్రిమ మేధస్సు, ఔషధ ఆవిష్కరణలపై సదస్సు

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో "సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు పాత్ర" అనే అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి శాతవాహన ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారతదేశపు ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికత అయిన కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే అద్భుతమైన, సురక్షితమైన సరికొత్త ఔషధాలను కనుగొనవచ్చని అన్నారు. పరిశోధనల్లో ఇలాంటి నూతన సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

​ఈ సదస్సుకు గౌరవ అతిధిగా రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి మాట్లాడుతూ సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాస్త్రీయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు.

​ఈ సదస్సులో ముఖ్య వక్తగా హైదరాబాద్‌లోని (సి ఎస్ ఐ ఆర్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నేచురల్ ప్రొడక్ట్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ చీఫ్ సైంటిస్ట్ & హెడ్ డాక్టర్ కె. నాగయ్య హాజరై ప్రసంగిస్తూ సాంప్రదాయ మూలికల నుండి తక్కువ సమయంలో, ఖచ్చితత్వంతో ఔషధ కణాలను వేరు చేయడానికి ఏ ఐ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో,

సమకాలీన సమాజంలో కొత్త తరహా ఉత్పత్తులను కృత్రిమ మేధస్సు సహాయంతో తయారు చేసుకోవడంలో నేర్చుకునే మెలకువలను తెలిపారు. కృత్రిమ మేధస్సు పై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ కృత్రిమ మేధస్సు ద్వారా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన ఫార్మసీకి సంబంధించిన అనేక మూలకాలను, ఔషధాలను అతి తక్కువ ఖర్చుతో తయారుచేసి మానవాళికి అందించవచ్చని తెలియజేశారు.

​ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డా. ఎస్. రమాకాంత్ (ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్), డాక్టర్ జయంతి డా. సరసిజ, నమ్రత,​ కళాశాల అధ్యాపకులు డా. క్రాంతి, డా. శ్రీశైలం, డా. శ్రీవిద్య, డాక్టర్ రాజు, డా.విజయ్ కుమార్, డా.మల్లారెడ్డిలతో పాటు ఫార్మసీ, కెమిస్ట్రీ విభాగాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story