Karimnagar: క్యాన్సర్ మందుల తయారీలో మొక్కలే కీలకం!
Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో 100 రోజుల విద్యా ప్రణాళికలో భాగంగా ఫార్మసీ విద్యార్థులకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్.
Karimnagar: క్యాన్సర్ మందుల తయారీలో మొక్కలే కీలకం!
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో డిగ్రీ కళాశాలల 100 రోజుల విద్యా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా కె శ్రీశైలం అధ్యక్షతన జరిగగా ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి సతీష్ కుమార్ , పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ ఔషధాలకు మొక్కలు కీలకమైనవని.
క్యాన్సర్ ఔషధాలకొరకు చేసే పరిశోధనలో మొక్కలు కీలక పాత్ర వహిస్తాయని అన్నారు.
ప్రముఖ టాక్సానమిస్ట్ డా ఇ నరసింహ మూర్తి వక్త గా పాల్గొని ప్రసంగించారు. డా మూర్తి మాట్లాడుతూ మొక్కలు ఎన్నో ఔషధాలకు నిలయమని, ముఖ్యంగా సంక్లిష్ట సమ్మేళనాలతో కూడిన క్యాన్సర్ ఔషధాల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు. క్యాన్సర్ మందులను ఉత్పత్తి చేసే వివిధ మొక్కల గురించి విశదీకరించారు.
ఈ కార్యక్రమం లో కన్వీనర్ డా పి క్రాంతి రాజు మాట్లాడుతూ క్యాన్సర్ని లొంగదీసుకోవడం ఒక సవాలుగా స్వీకరించాల్సి ఉంటుందని, ఇందుకు మొక్కల పై అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు.
అనంతరం స్థానికంగా దొరికే బిళ్లగన్నేరు ఆకుల నుండి క్యాన్సర్ రసాయనాలను వేరుచేసే ప్రక్రియను ప్రిన్సిపల్ డా శ్రీశైలం ప్రయోగశాల లో ప్రయోగాత్మకంగా వివరించారు.
ముగింపు సమావేశం లో పాల్గొన్న అకడెమిక్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ డా శ్రీరంగ ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం తరపున విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు 100 రోజుల కార్యక్రమం చేపడున్నామని విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో నగరం లోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాల లకు చెందిన అధ్యాపకులు విధ్యార్థులు పాల్గొన్నారు.




