Karimnagar: ఉకె శిరీషకు న్యాయం చేయాలి శాతవాహన వర్సిటీ విద్యార్థుల నిరసన!

Karimnagar: ఆదివాసీ యువతి ఉకె శిరీష అత్యాచారం, హత్య ఘటనపై శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Sept 2026 5:27 PM IST
Karimnagar
X

Karimnagar: ఉకె శిరీషకు న్యాయం చేయాలి శాతవాహన వర్సిటీ విద్యార్థుల నిరసన!

Karimnagar: ఆదివాసీ యువతి ఉకె శిరీషాపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు నేడు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. మృతురాలికి నివాళులర్పించి, ఆమెకు జరిగిన అన్యాయంపై వెంటనే చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కాలంలో ఆదివాసీ పిల్లలు అనేక కష్టాలను అధిగమించి బయటకు వచ్చి చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాలను నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక కుటుంబాల్లో ఇదే విద్య, ఉద్యోగాల వైపు వస్తున్న మొదటి తరం. ఇలాంటి సమయంలో యువతులపై ఇలాంటి దారుణాలు జరగడం వల్ల వారు సమాజంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఎదగడం ఎలా అని విద్యార్థులు ప్రశ్నించారు.

ఈ ఘటనపై పోలీసులు వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని, నిర్లక్ష్యం లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర ఘటనలు పెద్ద ఎత్తున వార్తల్లోకి వస్తున్నప్పటికీ, ఒక ఆదివాసీ యువతిపై జరిగిన ఇలాంటి దారుణ ఘటనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసును వేగంగా విచారించి, నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించి ఉకె శిరీషాకు న్యాయం చేయాలని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story