Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్దే మా ద్యేయం.. ఆచార్య ఉమేశ్

Karimnagar: జాతీయ జెండాను ఆవిష్కరించిన వీసీ ఆచార్య ఉమేశ్ కుమార్. ఈ విద్యా సంవత్సరం నుండే నూతన కోర్సులు, డిజిటల్ బోధనపై ఉపకులపతి కీలక ప్రకటన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Jun 2026 2:21 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్దే మా ద్యేయం.. ఆచార్య ఉమేశ్

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ జాతీయ పతాకం ఎగరవేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని రకాల మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని ఆధునిక పద్ధతులలో డిజిటల్, ఈ- క్లాస్ రూములతో విద్యాబోధన జరుగుతోందన్నారు.

ఈ కొత్త విద్యా సంవత్సరంలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కళాశాలలో రెండేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుకి దరఖాస్తు చేసామని మనకున్న సౌకర్యాలకు కోర్స్ నిర్వహించడానికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే అధ్యాపక అధ్యాపకేతర బృందం కలిసి సమిష్టిగా పనిచేస్తూ తెలంగాణలోని మెరుగైన విశ్వవిద్యాలయంగా నిలపడానికి ప్రయత్నం చేయాలన్నారు.

ఈ రాష్ట్ర అవతరణ వేడుకలలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, ఓ ఎస్ డి టు వి సి డా. హరికాంత్, డీన్ సీడీసీ డా.జాఫర్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.రమాకాంత్, డా.పద్మావతి, డా.మనోహర్, డా.శ్రీశైలం, పరిపాలనాధికారులు డా. నజిముద్దీన్ మునవర్, డా.హుమెరా, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story