Chandurthi: చందుర్తి శివారులో రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!
Chandurthi: చందుర్తి శివారులోని కెనాల్ సమీపంలో మంగళవారం అతివేగంతో వచ్చిన కారు బొలెరో క్యాంపర్‌ను ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు.
Chandurthi: చందుర్తి శివారులో రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు!
చందుర్తి: ఈరోజు చందుర్తి గ్రామ శివారులోని కెనాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించడం జరిగింది.
వివరాల్లోకి వెళితే, కడకంట్ల రమేష్ ప్రస్తుతం HM ప్రాజెక్టులో బొలెరో క్యాంపర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన సిబ్బందితో కలిసి బొలెరో క్యాంపర్ వాహనంలో చందుర్తి నుంచి రుద్రంగి వైపు వెళ్తుండగా, చందుర్తి గ్రామ శివారులోని కెనాల్ సమీపానికి చేరుకున్న సమయంలో, ఎదురుగా రుద్రంగి వైపు నుంచి వస్తున్న టాటా బోల్ట్ కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి బొలెరో క్యాంపర్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బొలెరో క్యాంపర్‌లో ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులకు మరియు కార్ లో ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ఈ ఘటనపై కడకంట్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. వాహనదారులు అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌కు దూరంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చందుర్తి పోలీసులు సూచిస్తున్నారు.




