Manthani: మంథనిలో కోతుల స్వైరవిహారం: యువకుడిపై దాడి, తీవ్ర గాయాలు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజుపల్లిలో కోతులు వీరంగం సృష్టించాయి. యువకుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

SHANKAR, MANTHANI
Published on: 2 Sept 2026 11:03 PM IST
Manthani
X

Manthani: మంథనిలో కోతుల స్వైరవిహారం: యువకుడిపై దాడి, తీవ్ర గాయాలు!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజుపల్లి 5వ వార్డు లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. బుధవారం కోతులు ఇండ్లల్లో వీరంగం సృష్టించాయి. కోతుల భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణుకుతున్న పరిస్థితి నెలకొంది. అంబటి శ్రావణ్‌ అనే ఈ యువకుని పై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గత వారం రోజులుగా వార్డులో పలువురిపై కోతులు దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. పనుల నిమిత్తం రహదారుల వెంట వెళ్లే ప్రజలను, చిన్నారులను కోతులు వెంబడిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయని వాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల లోకి చొరబడుతూ నిత్యావసర వస్తువులను ఎత్తుకెళ్లడం, ప్రజలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. కోతుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ మున్సిపల్‌ అధికారులు, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story