Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

Karimnagar: కరీంనగర్ నగరంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 6 July 2026 1:07 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

కరీంనగర్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. ర్యాలీగా తరలివచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు విద్యార్థులు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యాశాఖకు ముఖ్యమంత్రి లేక విద్యా వ్యవస్థ కుంటుపడిందని తక్షణమే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎం ఈ ఓ, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యారంగా సమస్యలు పరిష్కరించకుంటే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story