Jammikunta: కాంగ్రెస్ ఇస్తున్న పింఛన్లను కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం సిగ్గుచేటు!
Jammikunta: కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటని జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.
Jammikunta: కాంగ్రెస్ ఇస్తున్న పింఛన్లను కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం సిగ్గుచేటు!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ ప్రచార కమిటీ సభ్యుడు సాయిని రవి మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు.
అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రమాద బీమా పథకాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయడం తగదన్నారు. ప్రజలకు ఎవరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో స్పష్టంగా తెలుసని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మానుకోవాలని కౌశిక్ రెడ్డికి హితావు పలికారు.
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని పరశురామారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దొడ్డే శ్రీకాంత్, మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, పొన్నగంటి విష్ణు, ఎగిత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, మానుపాటి సూర్య, పొనగంటి మధు, పూరెల్ల రాకేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలీం, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, పర్లపల్లి నాగరాజు, సజ్జు, పంజాల అజయ్, పాత ప్రసాద్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు గిరవేన శ్రీనివాస్, కొలుగురు రవి, తిరుపతి రెడ్డి, వేల్పుల ప్రశాంత్, గుల్లి జెఫనియా, టింకరాల కిషోర్, రాకేష్, గుర్రపు ప్రవీణ్, రాసపెల్ అశ్విన్, కొలుగురి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




