Manthani: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడిగా శశిభూషణ్ కాచే!
Manthani: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) సలహా కమిటీ సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది శశిభూషణ్ కాచే మూడోసారి నియమితులయ్యారు.
Manthani: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడిగా శశిభూషణ్ కాచే!
Manthani: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) సలహా కమిటీ సభ్యుడిగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త శశిభూషణ్ కాచే నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి వి. రాంచందర్ 2026 అక్టోబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పదవీకాలం మూడేళ్లుగా నిర్ణయించారు.
శశిభూషణ్ కాచే ఈ కమిటీలో సభ్యుడిగా మూడోసారి నియమితులు కావడం విశేషం. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలు, వినియోగదారుల సమస్యలు, ప్రజల అభిప్రాయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో సలహా కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు శశిభూషణ్ కాచే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథనికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్తకు రాష్ట్రస్థాయి కమిటీలో మరోసారి అవకాశం లభించడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.




