Karimnagar: జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం!

Karimnagar: కరీంనగర్ జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడిగా భాషవేణి మల్లేశం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Aug 2026 6:23 PM IST
Karimnagar
X

Karimnagar: జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం!

కరీంనగర్: జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గొర్ల కాపరుల సహకార సంఘం జిల్లా యూనియన్ ఎన్నికలు పూర్తయిన మొదటి జిల్లా కరీంనగర్ కాగా అధ్యక్ష ఉపాధ్యక్షులను మరియు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 14 సంవత్సరాల క్రితం ఎన్నికల నిర్వహించారు.

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి అక్బర్ జలాలోద్దిన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జలాలోద్దిన్ అక్బర్ మాట్లాడుతూ జిల్లా యూనియన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అధ్యక్షుడి గా ఎ భాషవేని మల్లేశం యాదవ్ , ఉపాధ్యక్షులు గా చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్ లుగా అగిత రవిందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లేల్ల పర్షరాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఒదేలు, బండి మల్లయ్య, ముక్కేర సదానందం, సందవేణి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

జులై 22 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 27 వ తేదీ నుండి 29 వరకు 3 రోజులు నిర్వహించగా 21 నామినేషన్ దాఖలు అవ్వగా 9 మంది విత్ డ్రా చేసుకొగా 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ మాట్లాడుతూ తాను గెలుపుకు సహకరించిన జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం గ్రామల అధ్యక్షులకు , యాదవ కురుమ సోదరులకు కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం నూతన కార్యవర్గం జిల్లా పశుసంవర్ధక అధికారి ఎన్ లింగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మంచాల రవిందర్ యాదవ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య కురుమ,బీర్ నాయకులు నాగారపు సత్యనారాయణ యాదవ్,కత్తుల రమేష్ యాదవ్, బబ్బురు కుమార్ యాదవ్, బీర్ల బీరయ్య కురుమ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story