Sircilla: గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్ వీఆర్‌కు లేదా ఏఆర్‌కు అటాచ్!

Sircilla: గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌పై థర్డ్ డిగ్రీ ఆరోపణలు. ఎస్‌ఐని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలు. విచారణకు డీఎస్పీ నియామకం.

KALEEM, SIRICILLA
Published on: 16 Oct 2026 2:36 PM IST
Sircilla
X

Sircilla: గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్ వీఆర్‌కు లేదా ఏఆర్‌కు అటాచ్!

Sircilla: గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. ఈ వ్యవహారంపై విచారణకు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు.

‘ఎక్దం’ పత్రికలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తూ వరుస కథనాలు ప్రచురించారనే కారణంతో పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లపై గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం 2026 అక్టోబర్ 13న పోలీస్‌స్టేషన్‌లో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రిమాండ్‌కు తరలించారనే ఆరోపణలు ఎస్‌ఐపై వచ్చాయని తెలిపారు.

ఈ ఆరోపణలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, విచారణలో ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా శాఖాపరమైన చర్యలు తప్పవని మహేష్ బి. గితే హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA