Singareni: భరోసా యాత్రలో కిషన్ రెడ్డిని కలిసిన లక్కా శ్రవణ్ గౌడ్

Singareni: సింగరేణిలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యను పరిష్కరించాలని సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు వినతిపత్రం.

VIJAY, RAMAGUNDAM
Published on: 14 July 2026 5:49 PM IST
Singareni
X

Singareni: భరోసా యాత్రలో కిషన్ రెడ్డిని కలిసిన లక్కా శ్రవణ్ గౌడ్

Singareni: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్ గౌడ్ వినతిపత్రం.

సింగరేణి భరోసా యాత్రలో సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రవణ్ గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా లక్కా శ్రవణ్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి మారుపేర్లు , విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, ప్రత్యేక కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేసి, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఇటీవల తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ, అదే చొరవతో మారుపేర్ల బాధితుల సమస్య పరిష్కారానికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం తన ప్రసంగంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, సింగరేణి మారుపేర్ల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం తరఫున, ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకొని వేలాది బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story