Manthani: మంథనిలో పుట్ట మధు ఫైర్.. సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం ఓసిపి-2 వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 25 May 2026 11:25 AM IST
Manthani
X

Manthani: మంథనిలో పుట్ట మధు ఫైర్.. సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం ఆర్జీ త్రీ పరిధిలోని ఓసిపి-2 లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ... సింగరేణి కార్మికులకు 250 గజాలు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని మళ్ళీ ఎలక్షన్లో రాగానే మళ్లీ మాయమాటలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు వస్తాయని సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మేనిఫెస్టీ లో 39 హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని పుట్ట మధు మండిపడ్డారు. సింగరేణిని లాభాల బాటలో ఉంచేందుకు కార్మికులు కష్టపడుతుంటే కనీసం కార్మికుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలేదని పుట్ట మధు విమర్శించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story