Ramagundam: సింగరేణి చరిత్రలోనే తొలిసారి 15 రోజుల అధికారుల దీక్ష విరమణ!

Ramagundam: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనతో 15 రోజుల రిలే నిరాహార దీక్షలు విరమించిన సింగరేణి అధికారులు. పీఆర్పీ, వేతన సవరణకు లైన్ క్లియర్.

VIJAY, RAMAGUNDAM
Published on: 14 July 2026 7:43 AM IST
Ramagundam
X

Ramagundam: సింగరేణి చరిత్రలోనే తొలిసారి 15 రోజుల అధికారుల దీక్ష విరమణ!

Ramagundam: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ప్రకటనతో సింగరేణి అధికారుల 15 రోజుల దీక్షల విరమించారు, నిరంతర నిరసనలతో విజయం లో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి కృతజ్ఞతలు తెలిపిన కోల్ మేన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్...

తొలిసారిగా సింగరేణి చరిత్రలో అధికారులు రోడ్లపైకి వచ్చి చేపట్టిన నిరసనలు 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితంగా పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP) పిఆర్పి వేతన సవరణ తో పాటు ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కారం కోసం సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగతుగా తమ సూచనలను పరిగణంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి చీఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతికి ఆదేశించారు. సింగరేణి చీఫ్ పర్సనల్ రిలేషన్ ఆఫీసర్ ప్రకటనలో తెలిపారు.

కోల్ ఇండియాలో అమలవుతున్న విధంగానే సింగరేణిలోనూ పెండింగ్ పీఆర్పీ చెల్లింపులు, వేతన సవరణ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కోల్ మైన్స్ అధికారులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story