Chopperdandi: మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ధ్వజం!

Chopperdandi: చొప్పదండిలో ఓటర్ల గృహ సందర్శనలో భాగంగా SIR ఫారాలపై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలపై బీజేపీ నేత కృష్ణారెడ్డి మండిపడ్డారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 25 Jun 2026 3:30 PM IST
Chopperdandi
X

Chopperdandi: మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ధ్వజం!

చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో నేడు బూత్ లెవల్ అధికారులు ఓటర్ల గృహాలు సందర్శించి వారికి ఎస్.ఐ.ఆర్ ఫారంలు అందిస్తూ అవగాహన కల్పించారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగంపేట తాజా మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి

తన కుటుంబ సభ్యుల యొక్క ఎస్.ఐ.ఆర్ ఫారం లు నింపి అధికారులకు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్.ఐ.ఆర్ వల్ల ఓట్లు పోతాయని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఎస్.ఐ.ఆర్ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటే కేవలం బంగ్లాదేశీ రోహింగ్యాల ఓట్లు కాపాడటం కోసం కోసం పొన్నం ప్రభాకర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు గవర్నర్ ను, మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఎస్.ఐ.ఆర్ మరింత పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు.

కేరళలో డూప్లికేట్ ఓట్లు తగ్గిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగిందని శశి థరూర్ పేర్కొన్నారని సుప్రీంకోర్టు ఎస్.ఐ.ఆర్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన పిటిషన్లు కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఏస్. ఐ.ఆర్ లో ఏ ఒక్క అర్హుడైన ఓటర్ తన ఓటు కోల్పోయిన దాఖలా లేదని కేవలం మరణించిన వారివి, మరియు రెండు సార్లు నమోదు అయిన డూప్లికేట్ ఓట్లు మాత్రం తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

అంతేకాక ఎస్.ఐ.ఆర్ లో పాల్గొనే ఎన్నికల అధికారులు బిఎల్వోలు సూపర్వైజర్లు, మండల డివిజనల్ జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, మీరు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పని చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసే ఓట్లపైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు విశ్వాసం లేకపోవటం విడ్డూరమని సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో చొప్పదండి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పెరిక శ్రావణ్, గుండె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story