Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరికలు. నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గౌరు రాజశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పార్టీలో చేరారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజీద్, ఇతర నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ మాట్లాడుతూ.. తంగళ్లపల్లి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కవితక్కను ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సంకల్పంతో పార్టీలో చేరిన వారు పనిచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కవితక్క ప్రవేశపెట్టిన పంచజన్యం విధానాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి-ఉద్యోగాలు, సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కవితక్కను ముఖ్యమంత్రిని చేసేందుకు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అల్లె శంకర్, ముష్కం నందిని, చిన్ని బాల్రెడ్డి, సయ్యద్ జావిద్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్, కోశాధికారి బైరి రాజేష్, తంగళ్లపల్లి నాయకులు రాచర్ల రాజు, గౌరు శ్రీనివాస్, ఇల్లందుల శ్రీనివాస్, అలుగునూరి బాలయ్య, ఇల్లందుల మల్లయ్య, మెతుకు లక్ష్మీనర్సవ్వ, ఇల్లందుల భాగ్య, మోహిని కనకవ్వ, మహేశ్వరి, సరిత, లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.




