Chandurthi: తిమ్మాపూర్ ధాన్యం కేంద్రాన్ని తనిఖీ చేసిన నగేష్

Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తనిఖీ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 19 Nov 2026 8:38 PM IST
Chandurthi
X

Chandurthi: తిమ్మాపూర్ ధాన్యం కేంద్రాన్ని తనిఖీ చేసిన నగేష్

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నవంబర్ 19న అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేసి, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు.

ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA