Sircilla: అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!

Sircilla: సిరిసిల్ల అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేసి మందుల నిల్వలు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలపై ఆదేశాలు ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 4:18 PM IST
Sircilla
X

Sircilla: అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్‌సీ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతి అర్హత కలిగిన చిన్నారికి టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, పరీక్షలు, చికిత్సతో పాటు బాధితులకు నిరంతర ఫాలోఅప్ నిర్వహించాలని తెలిపారు.

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రజలకు క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం, మద్యపానం వల్ల క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రతిరోజూ వ్యాయామం, క్రమబద్ధమైన జీవనశైలిపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిబ్బందిని ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA