Sircilla: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె.. సిరిసిల్లలో నోటీసు!
Sircilla: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రూ.18 వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సమ్మె నోటీసు అందజేసిన సీఐటీయూ నేతలు.
Sircilla: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె.. సిరిసిల్లలో నోటీసు!
Sircilla: సిరిసిల్ల డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించడంతో పాటు ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు.
ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు.




