Sircilla: కోర్టు ఉద్యోగాలు సాధించిన ముగ్గురికి బీసీ స్టడీ సర్కిల్ అభినందనలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్‌తో కోర్టు ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి సన్మానించారు.
Sircilla: కోర్టు ఉద్యోగాలు సాధించిన ముగ్గురికి బీసీ స్టడీ సర్కిల్ అభినందనలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ పొందిన ముగ్గురు అభ్యర్థులు ఇటీవల విడుదలైన కోర్టు ఉద్యోగాల ఫలితాల్లో విజయం సాధించారు. కొత్తకొండ కావ్యశ్రీ, లింగంపల్లి మానస, గసికంటి ప్రత్యూషలను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి మాట్లాడుతూ, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఉద్యోగంతోనే ఆగిపోకుండా మరింత ఉన్నత ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.
అలాగే జిల్లాలోని నిరుద్యోగ యువత బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన 125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోర్సు, హైదరాబాద్‌లో అందిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ హరీష్‌తో పాటు సురేష్, కిరణ్మయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.




