Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత!
Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో రాస్తారోకో.. అంబేద్కర్ చౌక్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత!
Sircilla: నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే ఇలా దాడులకు పాల్పడితే.. 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న తాము దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు.




