Sircilla: సిరిసిల్లలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ ప్రెసిడెంట్ రెడ్డబోయిన గోపి.

KALEEM, SIRICILLA
Published on: 7 July 2026 9:33 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

సిరిసిల్ల: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన రెడ్డబోయిన గోపి.. "ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా" అనే నినాదంతో దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు లక్ష్యంగా ఆయన చేసిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రం వెంకటరాజన్, కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, ఉరవగొండ రాజు, మామిడాల మహేష్, మోర శ్రీహరి, మోర రవి, సూరం వినయ్, దూడం సురేష్, గాలి శ్రీనివాస్, కనుకయ్య, సిద్ది దేవరాజు, గొట్టే భాను తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story