Sircilla: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర!

Sircilla: కేసీఆర్ మళ్లీ తెలంగాణ సీఎం కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ నేతల పాదయాత్ర. అయ్యప్ప గుడిలో పూజలు చేసి యాదగిరిగుట్టకు పయనం.

KALEEM, SIRICILLA
Published on: 11 Nov 2026 12:26 PM IST
Sircilla
X

Sircilla: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన గులాబీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ముస్తాబాద్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీ. కొండ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఈ పాదయాత్రను ప్రారంభించారు.

ముందుగా ముస్తాబాద్‌లోని అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవెల్లి వరకు పాదయాత్ర కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA