Sircilla: సిరిసిల్ల గీతానగర్, విద్యానగర్‌లో ఘనంగా శమీ పూజ ఉత్సవం

Sircilla: సిరిసిల్ల గీతానగర్, విద్యానగర్‌లో ఘనంగా శమీ పూజ. పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు. జమ్మి ఆకులు మార్చుకుని శుభాకాంక్షలు.

KALEEM, SIRICILLA
Published on: 20 Oct 2026 11:22 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల గీతానగర్, విద్యానగర్‌లో ఘనంగా శమీ పూజ ఉత్సవం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్, విద్యానగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శమీ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA