Sircilla: కలెక్టరేట్‌లో మట్టి వినాయకుడి ప్రతిష్ఠాపన - పూజలు చేసిన కలెక్టర్

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు.

KALEEM, SIRICILLA
Published on: 14 Sept 2026 5:46 PM IST
Sircilla
X

Sircilla: కలెక్టరేట్‌లో మట్టి వినాయకుడి ప్రతిష్ఠాపన - పూజలు చేసిన కలెక్టర్

సిరిసిల్ల: వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, శ్రీకాంత్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీవైఎస్ఓ రాందాస్, వేములవాడ తహసీల్దార్ జయంత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA