Sircilla: సిరిసిల్ల వర్షాల తర్వాతే మొక్కలు నాటాలి కలెక్టర్

Sircilla: సిరిసిల్లలో 8.65 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా వన మహోత్సవం. వర్షాల కోసం వేచి చూస్తూ ముందస్తు గుంతలు సిద్ధం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 15 July 2026 7:30 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల వర్షాల తర్వాతే మొక్కలు నాటాలి కలెక్టర్

సిరిసిల్ల: వర్షాలు కురిసిన తర్వాతే మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వన మహోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ప్రతి శాఖకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. గతంలో నాటిన మొక్కల్లో ఎండిపోయిన లేదా పెరగని మొక్కలను అటవీశాఖ అధికారులు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నీటి పారుదల శాఖ స్థలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవీ ప్రాంతాలు, మున్సిపల్ డంపింగ్ యార్డులు, ఫారెస్ట్ అర్బన్ పార్కులు, ఎక్సైజ్ శాఖ పరిధి, కొత్త రహదారుల వెంట మొక్కలు నాటేందుకు గుంతలు ముందుగానే తవ్వి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొత్తం 8,65,200 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story