Sircilla: భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: సిరిసిల్లలో భూముల రీసర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. పారదర్శకతతో కచ్చితత్వంతో సర్వే పూర్తి చేయాలని ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 7:05 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రీసర్వేలో భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించి, కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు.

భూముల రీసర్వే ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులను ఆయా తహసీల్దార్లకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన భూముల వివరాలను సంబంధిత రికార్డులతో పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూముల వివరాలను ఆయా శాఖల అధికారులకు అందజేయాలని తెలిపారు.

రీసర్వే కోసం అవసరమైన రోవర్లను అందుబాటులో ఉంచడంతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA