Sircilla: ఈ నెల 15న 150 జతల కోడెల పంపిణీ.. 10లోగా దరఖాస్తు చేయండి!

Sircilla: వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో ఈ నెల 15న 150 జతల కోడెల పంపిణీ. చిన్న, సన్నకారు రైతులు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచన.

KALEEM, SIRICILLA
Published on: 6 Sept 2026 6:46 AM IST
Sircilla
X

Sircilla: ఈ నెల 15న 150 జతల కోడెల పంపిణీ.. 10లోగా దరఖాస్తు చేయండి!

Sircilla: వేములవాడ తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో ఈ నెల 15న 150 జతల కోడెలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

రాజన్న సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు కోడెల పంపిణీకి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత పత్రాలతో ఈ నెల 15న ఉదయం 8 గంటలలోపు తిప్పాపూర్ గోశాలకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ ఉన్న కోడెలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

జియో ట్యాగింగ్, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా కోడెలను పక్కదారి పట్టకుండా పర్యవేక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు. కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

కోడెలను పక్కదారి పట్టించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కోడెలు పొందిన రైతులు, వారి కుటుంబ సభ్యులు ఈసారి పంపిణీకి అర్హులు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story