Sircilla: జీజీహెచ్ అభివృద్ధి పనులపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష

Sircilla: సిరిసిల్ల జీజీహెచ్ అభివృద్ధి పనులపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 22 Sept 2026 8:23 PM IST
Sircilla
X

Sircilla: జీజీహెచ్ అభివృద్ధి పనులపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ వైద్య విభాగాల శాఖాధిపతులు, ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.

రోజువారీ ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ కింద వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిపాదించిన ప్రతి పరికరం అవసరం, వినియోగంపై సంబంధిత హెచ్‌ఓడీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి అభివృద్ధి కోసం చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ సుభాషిణి, డాక్టర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA