Sircilla: సిరిసిల్లలో ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభం.. కలెక్టర్ ఆదేశాలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24 లోగా ఫారాలు సమర్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Jun 2026 7:23 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభం.. కలెక్టర్ ఆదేశాలు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కీలక సూచనలు చేశారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు.

జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బూత్ లెవెల్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని ఆదేశించారు.

బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. ప్రతి ఓటరు తమ ప్రస్తుత పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

జూలై 24వ తేదీలోగా ఫారాలు, ఫొటోలను బీఎల్ఓలకు అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story