Sircilla: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి!
Sircilla: వేములవాడ అనుపురం రోడ్డు ప్రమాద బాధితులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. వైద్యులకు కీలక ఆదేశాలు.
Sircilla: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి!
Sircilla: వేములవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వేములవాడ మండలం అనుపురం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 మంది క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న చికిత్సపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్న కలెక్టర్... ప్రతి క్షతగాత్రిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు అవసరమైన మందులు, పండ్లు, పోషకాహారం, చపాతీలు అందించాలని ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యం మెరుగుపడిన బాధితులను వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలినా అల్ఫ్రెడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, తహసీల్దార్ మహేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




