Sircilla: అక్రమ పెన్షన్లు, ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. విచారణ కోరిన నేత

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హత లేని వారి సామాజిక పెన్షన్లు, భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు సోమిశెట్టి దశరథం ఫిర్యాదు; సమగ్ర విచారణకు డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 9:50 PM IST
Sircilla
X

Sircilla: అక్రమ పెన్షన్లు, ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. విచారణ కోరిన నేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హత లేని వారు సామాజిక పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు పొందుతున్నారని ఆరోపిస్తూ AIFTU న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఒకే కుటుంబానికి చెందిన గాజుల బాలయ్య, ఆయన భార్య సరోజన, కోడలు సామాజిక పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన బాలయ్యకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు అందాల్సిన పథకాలు అనర్హులకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే సర్వే నంబర్ 39లో రోడ్డు, నాలా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, కమర్షియల్ భవనానికి మున్సిపల్ పన్నులు చెల్లించడం లేదని ఫిర్యాదులో ఆరోపించారు. 30 అడుగుల రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి, సెట్‌బ్యాక్‌లు లేకుండా భవనం నిర్మించారని, అనుమతులు లేకుండా కార్ఖానా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోమిశెట్టి దశరథం కలెక్టర్‌ను కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA