Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ బీఎల్‌ఏల శిక్షణా సమావేశం

Sircilla: సిరిసిల్ల డిసిసి కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండో విడతపై కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు DCC అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Aug 2026 5:47 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో కాంగ్రెస్ బీఎల్‌ఏల శిక్షణా సమావేశం

సిరిసిల్ల: డిసిసి కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) రెండో విడత ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఫక్రుద్దీన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మొదటి విడతలో ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఫారాలు సమర్పించని వారు, ఒకటికి మించిన ఓట్లు కలిగిన వారు, మరణించిన ఓటర్ల వివరాలు వంటి అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.

అభ్యంతరాల అనంతరం ప్రకటించిన ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు అందించినట్లు చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి స్థానికంగా లేని వారు, మరణించిన వారు, ఒకటికి మించిన ఓట్లు కలిగిన వారు, అచ్చుతప్పులతో నమోదైన ఓటర్ల వివరాలను గుర్తించాలని సూచించారు.

ప్రతిరోజూ కనీసం 30 ఇళ్లను సందర్శించాలి

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతిరోజూ కనీసం 30 ఇళ్లను సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సంగీతం శ్రీనివాస్ సూచించారు. వివరాల్లో తప్పులు ఉన్నా, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోయినా వాటిని గుర్తించి బీఎల్‌వోలకు సమాచారం అందించాలని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమైనదని, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఆకునూరి బాలరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story