Sircilla: సిరిసిల్లలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను, ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు. దేశ అభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




