Sircilla: రాహుల్ అరెస్ట్‌కు నిరసన.. సిరిసిల్లలో కాంగ్రెస్ ఆందోళన

Sircilla: రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నిరసన.

KALEEM, SIRICILLA
Published on: 22 July 2026 2:04 PM IST
Sircilla
X

Sircilla: రాహుల్ అరెస్ట్‌కు నిరసన.. సిరిసిల్లలో కాంగ్రెస్ ఆందోళన

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన

ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story