Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో ఘనంగా యోగా దినోత్సవం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

KALEEM, SIRICILLA
Published on: 21 Jun 2026 3:46 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో ఘనంగా యోగా దినోత్సవం

Sircilla: జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి పి. నీరజ పాల్గొని యోగా ప్రాముఖ్యతపై మాట్లాడారు.

యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి. నీరజ అన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా శిక్షకుడు ఆడెపు రవీందర్ సూచనల మేరకు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి బి. పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story