Sircilla: ప్రమాదకరంగా పడిపోతున్న భూగర్భ జలాలు.ఏడాదిలో 2.91 మీటర్ల క్షీణత

Sircilla: జిల్లాలో భూగర్భ జల మట్టాలు క్రమంగా దిగజారుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సగటున 2.91 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది.

KALEEM, SIRICILLA
Published on: 21 July 2026 11:21 PM IST
Sircilla
X

Sircilla: ప్రమాదకరంగా పడిపోతున్న భూగర్భ జలాలు.ఏడాదిలో 2.91 మీటర్ల క్షీణత

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జల మట్టాలు క్రమంగా దిగజారుతున్నట్లు భూగర్భ జల శాఖ వెల్లడించింది. జూలై-2026 తొలి పక్షంలో నిర్వహించిన పరిశీలనల ప్రకారం జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం 12.26 మీటర్లు నమోదైంది.

మండలాల వారీగా బోయినపల్లి మండలంలో 7.82 మీటర్లతో అత్యల్ప లోతులో భూగర్భ జల మట్టం నమోదుకాగా, వేములవాడ అర్బన్ మండలంలో 21.38 మీటర్లతో అత్యధిక లోతులో నమోదైంది.

జూన్-2026తో పోలిస్తే జిల్లాలో సగటున 0.71 మీటర్లు, జూలై-2025తో పోలిస్తే 2.91 మీటర్లు, మే-2026తో పోలిస్తే 1.39 మీటర్ల మేర భూగర్భ జల మట్టం క్షీణించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సిరిసిల్ల, వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాల్లో గణనీయమైన క్షీణత నమోదైంది.

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజలు వర్షపు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని, ఇంకుడు గుంతలు, పంట కుంటలు, రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి భూగర్భ జలాల పునరుద్ధరణకు సహకరించాలని ఇన్‌చార్జి జిల్లా భూగర్భ జల శాఖ అధికారి నాగరాజు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story