Sircilla: సిరిసిల్ల ఫుడ్ పాయిజన్ బాధితుల పరామర్శ

Sircilla: సిరిసిల్ల జనరల్ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌ఓ డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 17 July 2026 9:15 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ఫుడ్ పాయిజన్ బాధితుల పరామర్శ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులను జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ పరామర్శించారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ప్రతి రోగికి అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్‌తో పాటు అన్ని వైద్య సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలను తినొద్దని సూచించారు.

ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story