Sircilla: సిరిసిల్లలో పల్స్ పోలియో తనిఖీ స్వయంగా చుక్కలు వేసిన డీఎంహెచ్‌వో
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కేంద్రాలను డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, చిన్నారులకు చుక్కలు వేశారు.
Sircilla: సిరిసిల్లలో పల్స్ పోలియో తనిఖీ స్వయంగా చుక్కలు వేసిన డీఎంహెచ్‌వో
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హై రిస్క్ ప్రాంతాలు, వలస కార్మికుల నివాసాలు, ఇటుక బట్టీలు, తాత్కాలిక గుడిసెల్లో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా చర్యలు చేపట్టారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్, జిల్లా డేటా మేనేజర్ కార్తీక్ కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. పోలియో బూత్‌లలో వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ నిర్వహణ, వ్యాక్సిన్ క్యారియర్లు, మార్కింగ్ విధానం, ట్యాలీ షీట్లు, రిజిస్టర్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం చంద్రంపేట, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని కుటుంబాలతో మాట్లాడిన డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ 15 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మిగిలిపోయిన చిన్నారులను హౌస్-టు-హౌస్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా కవర్ చేస్తామని వైద్య బృందాలు తెలిపారు.




