Sircilla: ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలి: డీఎంహెచ్‌వో అల్ఫ్రేడ్
Sircilla: డెంగీ, ఇతర సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి. ఎంజేలా అల్ఫ్రేడ్ సూచించారు.
Sircilla: ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలి: డీఎంహెచ్‌వో అల్ఫ్రేడ్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి. ఎంజేలా అల్ఫ్రేడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
సిరిసిల్ల పట్టణంలోని సుజాత్ నగర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో.. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, మురుగు గుంతలను పూడ్చివేయడం, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ లేదా కిరోసిన్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే కొబ్బరి బొండాలు, పాడైన టైర్లు వంటి వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల కాటుకు గురికాకుండా పొడవాటి చేతుల దుస్తులు ధరించాలని ప్రజలకు సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రానున్న వర్షాకాలంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జి. ఎంజేలా అల్ఫ్రేడ్ సూచించారు.




