Sircilla: రెండు హత్యలు.. 20 మంది సాక్షులు కోర్టు చారిత్రాత్మక తీర్పు!
Sircilla: గంభీరావుపేట పరిధిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
Sircilla: రెండు హత్యలు.. 20 మంది సాక్షులు కోర్టు చారిత్రాత్మక తీర్పు!
సిరిసిల్ల: సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిత ఖైదు (యావజ్జీవ కారాగార శిక్ష) విధించారు.
2018లో కొత్తపల్లి గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యను, 2022లో కామారెడ్డి జిల్లాకు చెందిన మన్నె నరసింహులును భూ వివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. రెండు కేసుల్లోనూ శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు, 20 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
ఈ కేసుల్లో సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.
సమాజంలో నేరం చేసిన ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని, పోలీసు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో నేరస్థులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.




