Sircilla: సిరిసిల్ల రగుడు వద్ద పోలీసుల తనిఖీలు.. రంగంలోకి డీఎస్పీ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని రగుడు వద్ద పోలీసులు భారీ వాహన తనిఖీలు చేపట్టారు.
Sircilla: సిరిసిల్ల రగుడు వద్ద పోలీసుల తనిఖీలు.. రంగంలోకి డీఎస్పీ
Sircilla: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శనివారం రోజున సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని రగుడు వద్ద నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో డిఎస్పీ నాగేంద్రచారి పాల్గొని క్షేత్రస్థాయిలో తనిఖీలను పర్యవేక్షించారు.
ఈసందర్భంగా విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,వాహనాల డాక్యుమెంట్లు పరిశీలించాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలను సీజ్ చేయాలని,మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని,మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.
అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తుల కట్టడి మరియు నేరాల నివారణ కోసమే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలకు ప్రజలందరూ సహకరించాలని డిఎస్పీ గారు కోరారు.




