Sircilla: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి డీఎస్పీ నాగేంద్ర చారి

Sircilla: ఇల్లంతకుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని మండపాల నిర్వాహకులకు డీఎస్పీ నాగేంద్ర చారి సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 8:09 AM IST
Sircilla
X

Sircilla: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి డీఎస్పీ నాగేంద్ర చారి

Sircilla: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ కత్రోజు నాగేంద్ర చారి గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, పోలీసుల అనుమతితో మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని స్పష్టం చేశారు.

మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తిశ్రద్ధలు పెంపొందించే పాటలు మాత్రమే వినిపించాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. మండపాల నిర్వాహకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు, ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్ర చారి, పోలీస్ సిబ్బంది, వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story