Sircilla: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన గంభీరావుపేట AMC పాలకవర్గం!

Sircilla: హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం. రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 28 Oct 2026 5:22 PM IST
Sircilla
X

Sircilla: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన గంభీరావుపేట AMC పాలకవర్గం!

Sircilla: గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి నూతన పాలకవర్గ సభ్యులు పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ హమీద్, వైస్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్లు మంత్రిని కలిశారు. నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA