Sircilla: సిరిసిల్లలో వైభవంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ బైక్ ర్యాలీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, ఖీర్ పంపిణీ నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Aug 2026 5:45 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో వైభవంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు

సిరిసిల్ల: ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు మీలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మీలాద్ ఉన్ నబీ సందర్భంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు.

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఖీర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. మీలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్‌, సయ్యద్ సలీమ్, సయ్యద్ సయీద్ హుస్సేన్,సులెమాన్ , ఫైజాన్ ,జైనుల్ మాజ్ తో పాటు మత పెద్దలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story