Sircilla: సిరిసిల్లకు విచ్చేసిన హైకోర్టు జడ్జి తుకారాంజీకి ఘన స్వాగతం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీకి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె ఘన స్వాగతం పలికారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Aug 2026 3:57 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లకు విచ్చేసిన హైకోర్టు జడ్జి తుకారాంజీకి ఘన స్వాగతం!

సిరిసిల్ల:

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీకి రాజన్న సిరిసిల్లలో ఘన స్వాగతం

హైకోర్టు న్యాయమూర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి. పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం జస్టిస్ ఎన్. తుకారాంజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి. లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి జి. మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్‌తో పాటు న్యాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story