Sircilla: రాజీ మార్గంతోనే సత్వర న్యాయం - జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా చెక్ బౌన్స్ తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Sept 2026 8:32 PM IST
Sircilla
X

Sircilla: రాజీ మార్గంతోనే సత్వర న్యాయం - జిల్లా ప్రధాన న్యాయమూర్తి

సిరిసిల్ల: కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి పి.నీరజ అన్నారు. “రాజీ మార్గమే రాజ మార్గం” అని పేర్కొన్నారు.

గురువారం జిల్లా కోర్టు సముదాయంలో సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.నీరజ మాట్లాడుతూ.. కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ప్రజలు సుదీర్ఘ న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు.

ముఖ్యంగా NI యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని న్యాయవాదులను కోరారు. లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కరించేలా న్యాయవాదులు సహకరించాలని సూచించారు.

లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కారానికి పంపేందుకు పూర్తి సహకారం అందిస్తామని బార్ అసోసియేషన్ సభ్యులు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల ఇన్‌చార్జి డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు, ప్రధాన కార్యదర్శి చ.వెంకయ్యతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story