Sircilla: ఈ నెల 12న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి - జడ్జి నీరజ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 12న లోక్ అదాలత్ జరగనుంది. కోర్టుల్లో పెండింగ్ కేసులను దీని ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు.
Sircilla: ఈ నెల 12న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి - జడ్జి నీరజ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సాధ్యమైనంత ఎక్కువ కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల ఇన్‌చార్జి డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మేఘనతో పాటు పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ పోలీసులు పాల్గొన్నారు.




