Sircilla: వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలన్న ఏఓ సందీప్
Sircilla: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామంలో ఎల్ నినో వాతావరణ ప్రభావంపై ఏఓ కే. సందీప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Sircilla: వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలన్న ఏఓ సందీప్
సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కే. సందీప్ సూచించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే సాగు చేసిన పంటల్లో నేల తేమను సంరక్షించేందుకు కలుపు నియంత్రణ, మల్చింగ్, అంతర దుక్కులు వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు.
అలాగే ఎరువులను ఒకేసారి కాకుండా పంట అవసరాన్ని బట్టి విడతల వారీగా వేయాలని, వాతావరణ శాఖ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు అనుసరించాలని రైతులకు సూచించారు. వర్షపు నీటిని చెరువులు, కుంటలు, ఫార్మ్ పాండ్లలో నిల్వ చేసి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్‌కుమార్‌తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.




